Saturday, November 16, 2024

TG | మానవ అక్రమ రవాణా.. ఆరుగురికి జీవిత ఖైదు

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: మానవ అక్రమ రవాణా కేసులో ఆరుగురు నిందితులకు హైదరాబాద్‌ ఎన్‌ఐఏ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఉద్యోగాల పేరిట బంగ్లాదేశ్‌ నుంచి మహిళలను తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారంలోకి దించినట్లు కోర్టులో రుజువు కావడంతో కోర్టు జీవితఖైదు శిక్షను ఖరారుచేసింది.

కాగా 2019లో పాతబస్తీలోని చత్రినాక పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా ఎన్‌ఐఏ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసులో కీలక ఆధారాలను పరిశీలించి నిందితులైన యూసఫ్‌ ఖాన్‌, అతడి భార్య బీతి బేగం, సోజిబ్‌, రాహుల్‌, అబ్దుల్‌ సలాం, షీలాలకు జీవిత ఖైదు విధించింది.

ఛత్రినాకలో అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా రాకెట్‌ కేసులో ఐదేళ్ల తర్వాత ఆరుగురు దోషులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. కాగా మానవ అక్రమ రవాణాకు సంబంధించి ఎన్‌ఐఏ చేపట్టిన మొట్టమొదటి కేసు ఇదేనని ఎన్‌ఐఏ వర్గాలు వివరించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement