బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. బెంగళూరు పరిధిలోని తాలెకెరె ప్రాంతంలో రెండు ట్రక్కులు ఢీకొన్నాయి. అదుపుతప్పి భారీ కంటెయినర్ కారుపై పడింది. ఈ ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు చనిపోయారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -