రష్యా ప్రయోగించిన ఒక రాకెట్ దాడిలో ఆరుగురు పౌరులు మరణించారని ఉక్రెయిన్ నివేదించింది. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఆదివారం రష్యా దళాలతో ఘర్షణలు జరిగినట్లు ఈ నివేదికలో పేర్కొంది. తాజాగా రష్యా దళాలు తూర్పు పట్టణం స్లోవియెన్స్‌కు సమీపంలో ఉక్రెయిన్ స్థానాలపై దాడి చేశాయి. ఉక్రెయిన్ మిలటరీ తమ సరిహద్దు వైపు నుండి ఈశాన్య నగరం ఖార్కివ్‌పై క్రూయిజ్ క్షిపణి దాడిని ప్రారంభించిందని ఉక్రెయిన్ మిలటరీ తెలిపింది.
అయితే ప్రాణ నష్టం వివరాలు మాత్రం వెల్లడించలేదు. గత రాత్రి రష్యన్లు ఏడు ఫిరంగి బ్యారేజీలు, నాలుగు రాకెట్ దాడులను ప్రారంభించారు. ఈ విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ తెలియజేసింది. అయితే యుద్దభూమిలో ఎంతమంది నేలకొరిగారు వంటి వివరాలు మాత్రం చెప్పలేకపోయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.