మహాశివుడు అందరికీ ఆరాధ్యదేవుడు. ఆయన శక్తి, యుక్తులను కొందరు నిర్మాతలు తెరపై ఆవిష్కరిం చారు. దక్షయజ్ఞం, వినాయకవిజయం, శ్రీమంజునాథ తదితర చిత్రాలు ఈ కోవకే చెందుతాయి. మహాశివుడు భక్తుల గాథలు సైతం వచ్చాయి.
శివుడు ప్రధాన పాత్రధారిగా తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్‌తో సహా దాదాపు హీరో లు అందరూ ఏదో ఒక సందర్భంలో శివుడిగా కనిపిం చారు. పౌరాణిక, జానపద, భక్తి సినిమాలు వెల్లువగా రూపొందుతున్న తరుణంలో శివుని పాత్ర ప్రధానంగా పలు సినిమాలు వచ్చాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో శివుని పాత్రలో శివతాండవం చేసిన హీరోలు ఎవరెవరు అనేది తెలు సుకుందాం….
దక్షయజ్ఞం చిత్రంలో దక్షుడిగా ఎస్వీ. రంగారావు నటించగా, ఎన్టీఆర్ శివుని పాత్ర లో నటించి మెప్పించారు. సినిమా ఫలితం ఎలా ఉన్న, కొన్ని అనుకోని సంఘటనలు ఎదురుకావడంతో ఈ సినిమా తరువాత మళ్లీ ఎన్టీఆర్ శివుని పాత్ర చెయ్యలేదు.
కృష్ణం రాజు శ్రీ వినాయక విజయంలో శివునిగా నటించారు. శివుని భక్తుడుగా భక్త కన్నప్ప పాత్రలో సైతం కృష్ణం రాజు నటించి మెప్పించారు.
అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబు పూర్తిస్థాయి శివుని పాత్రలో నటించలేదు.
సీనియర్ నటుడు బాలయ్య చాలా చిత్రాల్లో శివుని పాత్రను పోషించారు. బాలయ్య గారు జగన్మాత, భక్త కన్నప్ప వంటి అనేక చిత్రాలలో శివుని పాత్రలు పోషించి మెప్పించారు.
మహానటుడు ఎన్టీఆర్ నటించిన మాయామశ్చింద్ర చిత్రంలో రామకృష్ణ శివుని పాత్రలో నటించారు.
కృష్ణ హీరోగా నటించిన ‘ఏకలవ్య’ చిత్రం లో రంగనాథ్ మహాశివుడు పాత్రలో నటించారు.
- చిరంజీవి ఆపద్బాంధవుడు చిత్రంలోని చిన్న సన్నివేశంలో శివుని గాను, అదే విధంగా కెె.రాఘ వేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన శ్రీమంజునాథ చిత్రంలో పూర్తి స్థాయిలో మహాశివుని గా నటించి మెప్పించారు.
సుమన్ శ్రీ సత్యనారాయణ మహత్యం చిత్రంలో బ్ర హ్మగా, విష్ణువుగా శివుడిగా మూడు పాత్రల్లో కనిపించారు.
సీనియర్ క్యారెక్టర్ నటుడు రావు గోపాలరావు మా ఊ రిలో మహాశివుడు చిత్రంలోని శివుని పాత్రను పోషించారు.
రాజనాల ఉషా పరిణయం చిత్రంలో, నాగభూ షణం భూ-కై-లాస్ చిత్రంలో శివుని పాత్రను పోషించారు.
ఇంకా కమల్ హాసన్, విజయ్ కాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు శివుని పాత్రను పోషించిన వారిలో ఉన్నారు.
ఇంకా శివుని భక్తులైన అఘోర పాత్రలను సైతం మన తెలుగు హీరోలు ధరిస్తున్నారు.
చిరంజీవి శివుడిగా నటించిన చిత్రం శ్రీ మంజునాథ. సినిమాలో కీలక సమయం లో చిరంజీవి అఘోరాగా కనిపిస్తాడు. భక్తుడిగా నటించిన అర్జున్ కోసం చిరంజీవి ఆ వేషధార ణలో వస్తాడు. చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘నాగ వల్లి’. వెంకటేశ్ ఓ సందర్భంలో అఘోరా తరహాలో పాత్రలో మెరిశాడు. పి.వాసు ఈ సినిమా దర్శకుడు. నాగార్జున అఘోరా తర హా పాత్రలో నటించిన చిత్రం ‘ఢమరుకం’. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగ్ కాసేపు అఘోరాగా కనిపిస్తాడు. ఇందులో ప్రకాశ్‌రాజ్ శివుడి పాత్రలో కనిపించాడు. అంతకుముందు నేను దేవుణ్ని సినిమాలో ఆర్య కూడా ఇలాంటి పాత్రలోనే కనిపించాడు. త్వరలో యువ నటు-డు విశ్వక్ సేన్ కూడా ఇప్పుడు అఘోరాగా కనిపించే పనిలో ఉన్నాడు. తన తర్వాతి సినిమాలో విశ్వక్‌సేన్ ఈ తరహా పాత్రలో కనిపిస్తాడని తెలిసింది. స్టార్ హీరోలు, యువ హీరోలు అఘోరా లుగా కనిపించిన సినిమాలు ఇవే. ఇందులో అఖండ భారీ విజయాన్ని అందుకుంది.