Friday, October 18, 2024

Site Visit – నేడు కాళేశ్వరం ప్రాజెక్టు కు బీఆర్‌ఎస్ బృందం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అవినీతిమయం అంటూ అధికార కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు ప్రాజెక్టును సందర్శించనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగం ముగిసిన తరువాత వారంతా బస్సులో భారీ ర్యాలీగా వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు.

ఈ టూర్‌లో భాగంగా బీఆర్ఎస్ నేతలు మొదట ఎల్ఎమ్‌డీ రిజర్వాయర్‌ను సందర్శించి ఆ తరువాత రాత్రి రామగుండంలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్ దగ్గరకు వెళ్లి, 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పరిస్థితిని పరిశీలిస్తారు.

అనంతరం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమవుతుంది. ఇక కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారని బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతిందని చేస్తున్న విష ప్రచారాన్ని ఇప్పటికైనా ఆపాలని కోరారు.

- Advertisement -

తాజాగా, 10 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకుని మేడిగడ్డ నిలబడినట్టుగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దీంతో, గులాబీ పార్టీ నేతల కాళేశ్వరం పర్యటనకు అమిత ప్రాధాన్యం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement