Tuesday, November 19, 2024

సీతారాముల జీవితం ప్రపంచానికి ఆదర్శం : మంత్రి ఎర్రబెల్లి (వీడియోతో)

పాలకుర్తి : శ్రీ సీతారాముల జీవితం ప్రపంచానికి ఆదర్శం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం చారిత్రక వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో సీతారాముల క‌ల్యాణ మ‌హోత్స‌వం వైభ‌వంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ.. సీతారాముల వారి కళ్యాణోత్సవాలలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతం అన్నారు. పాలకుర్తి, బమ్మెర, వల్మీడిల పై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టార‌న్నారు. అభివృద్ధి చేసే అవకాశం నాకు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాన‌ని మంత్రి అన్నారు. సీఎం కెసిఆర్ ఆధ్వర్యంలోనే దేవాలయాలకు పూర్వ వైభవం వ‌చ్చింద‌న్నారు. ప్రముఖ చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా వల్మీడి దేవాలయం నిలుస్తోంద‌న్నారు. శ్రీ భద్రాద్రి తరహాలో వల్మీడి దేవాలయ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు.


మంత్రి సుడిగాలి ప‌ర్య‌ట‌న‌..
పాలకుర్తి నియోజకవర్గంలో రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సుడిగాలి పర్యటన చేశారు. శ్రీ రామ నవమి సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలు ఆలయాలు వారి సతీమణి ఉషా దయాకర్ రావు తో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి, మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం మాటేడు, తొర్రూరు, నాంచారి మడూరు, వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి తదితర దేవాలయాల్లో కళ్యాణోత్సవాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు – ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు దంపతులు హాజర‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement