ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ అధికారులు గతేడాది ఫిబ్రవరిలో సిసోడియాను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు. దీంతో ఆయన గత 18 నెలలుగా జైలులో ఉన్నారు.
కాగా, సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సిసోడియా పాస్‌పోర్టును సమర్పించాలని కోరింది. అలాగే వారానికి రెండుసార్లు (సోమ, గురువారాలు) పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని చెప్పింది. ఇక జైలు నుంచి విడుదలైన సిసోడియాకు ఆప్ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు.