హైదరాబాద్, (ప్రభ న్యూస్) : మెనుస్ట్రువ్రల్ హైజీన్ డే (రుతు పరిశుభ్రత దినోత్సవం, 28 మే 2022) సందర్భంగా దేశవ్యాప్తంగా 5000 మెనుస్ట్రువల్ కప్స్‌ను పేద మహిళలకు (రుతుస్రావం అయ్యే వయస్సులో ఉన్న వారికి) సిరోనా హైజీన్ ఫౌండేషన్ తో కలసి విరాళంగా అందించనున్నట్లు సంచలనాత్మక అగ్రగామి భారతీయ మహిళల హైజీన్ బ్రాండ్ అయిన సిరోనా ప్రకటించింది. ఈసందర్భంగా సిరోనా సీఈఓ, సహ వ్యవస్థాపకుడు దీప్ బజాజ్ మాట్లాడుతూ… ప్రతి మహిళ, ప్రతి బాలిక కూడా ఆరోగ్యదాయక జీవితాన్ని గడపాలని, అపోహలకు, బలవంతపు ఎంపికలకు దూరంగా ఉండాలని, అలాంటి ప్రపంచాన్ని చూడాలన్న ఆశయమే సిరోనా హైజీన్ ఫౌండేషన్ ఏర్పాటుకు బీజం వేసిందన్నారు. ప్రతి మహిళ తన రుతుస్రావం గురించి, దాని పట్ల వ్యవహరించే తీరును నేటికీ ప్రభావితం చేసే ఏళ్ల నాటి అపోహలను, ఆచారాలను దూరం చేయడం తమ కార్యక్రమం లక్ష్యమన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..