Wednesday, November 20, 2024

సిరి..ష‌ణ్ముఖ్ ల మ‌ధ్య ఏం జ‌రిగింది..

బిగ్ బాస్5 హూస్ లో రోజు రోజుకి వివాదాలు,ఆరోప‌ణ‌లు పెరిగిపోతున్నాయి. రిలీజ్ చేసిన ప్రోమోలు ఆస‌క్తిని రేపుతున్నాయి. కాగా రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రోమో చూస్తే.. సిరి, ష‌ణ్ముఖ్ ల మ‌ధ్య ఏదో జ‌రిగిన‌ట్టు స‌మ‌చారం. ఈ ప్రోమోలో వీరిద్దరు గొడవ పడుతూ కనిపించారు. షన్ను బాధపడుతున్నాడు. అది చూసిన.. సిరి ష‌న్నుకు న‌చ్చ‌చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. కానీ ష‌న్ను మాత్రం.. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్లిపో.. నా దగ్గరకు రాకు.. అని సీరియ‌స్ అయ్యాడు. దీంతో సిరి బాధ‌ప‌డింది. అయినా ష‌న్నుని ఓదార్చేందుకు ప్రయత్నించింది. షణ్ముఖ్‌ను కౌగిలించుకొని సిరి ఏడుపులో మునిగిపోయింది. నాకు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తోందని.. ఆమె నా పక్కన ఉంటే బాగుండు.. ఆమె నాతో ఉంటే కింగ్‌లా ఉండేవాడిని.. అన్నాడు.

ఈ క్ర‌మంలో సిరి ఇంకో నాలుగు వారాలు ఆగు.. మనం వెళ్లిపోదాం అని సిరి అంటే.. నువ్వు నాకొద్దంటూ ముఖం మీదే చెప్పాడు. అలా అన‌గానే.. సిరి రెండు చేతులతో తలకొట్టుకొంది. కంటెస్టెంట్ల అంద‌రూ ఏం జరుగుతున్నదనే ఆలోచనల్లో పడ్డారు. సిరి ఏడ్చుకుంటూ వాష్‏రూంలోకి వెళ్లి పోయింది. దీంతో వెంటనే షన్ను డోర్ తీయమని బ్రతిమిలాడాడు. కానీ సిరి హన్మంతు ఎంతకు బయటకు రాకపోవడంతో షణ్ముఖ్ వెళ్లి తలుపులు దబ దాబా బాదాడు. దీంతో కంటెస్టెంట్ల అంద‌రూ కంగారు పరుగెత్తుకుంటూ వెళ్లి సిరిని డోర్ తీయమని రిక్వెస్ట్ చేశారు. ఆ తరువాత ఏం జ‌రిగిందో తెలుసుకోవాలంటే.. ఈరోజు ఎపిసోడ్‏లో చూడాల్సిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

ఇవి కూడా చదవండి…

- Advertisement -

బిగ్ బాస్5 విన్న‌ర్ వీరే …

కేక్ తినేసిన స‌న్నీ..ఫైర్…

ఈ వారం ఎలిమినేష‌న్ పై నెట…

Advertisement

తాజా వార్తలు

Advertisement