సీనియర్ నటుడు నరేష్ కు అరుదైన గౌరవం దక్కింది. సుమారు 300 చిత్రాలలో నటించిన నరేష్ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. ఆయనలో మంచి వక్త కూడా ఉన్నారు. ప్రపంచ సమస్యలపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. ఉగ్రవాదం, సామాజిక సమస్యలు, తదితర అంశాలపై అనేక అంతర్జాతీయ వేదికలపై ఆయన ఇప్పటికే ప్రసంగించారు. అందుకు గుర్తింపుగా ‘సార్’ అనే బిరుదుతోపాటు ‘డాక్టరేట్’ని అందుకున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ నుంచి ఆయనకు ఈ గుర్తింపు దక్కింది.ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తాజాగా జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్ సమావేశాల్లో నటుడు నరేష్ కు ఈ అరుదైన గౌరవం దక్కింది.
ఈ సమావేశాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ సంస్థతోపాటు ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్) కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించాయి. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా, తదితర దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా.. అక్కడ నరేష్ కు మరో గౌరవం దక్కింది. మిలటరీ ఆర్ట్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌తో పాటు లెఫ్టినెంట్ కల్నల్‌గా నరేష్ ను నియమించారు. దీంతో ఇక నుంచి పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్ అనే హోదా చేరుతుంది.