హైదరాబాద్, ఆంధ్రప్రభ : నిత్యం దుమ్ము, దూళితో సతమతమయ్యే సింగరేణి నల్ల నేలపై హరిత సేద్యం నిర్విరామంగా కొనసాగుతోంది. మూడేళ్ల క్రితం సింగరేణి డైరెక్టర్ ఎన్. బలరామ్ స్వతహగా ఎన్టీపీసీ ఆవరణలో అర ఎకరంలో 500 మెక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఇప్పుడు వాటి సంఖ్య 14 వేలకు చేరింది. ఈ హరితహార కార్యక్రమం ప్రతి ఒక్కరిలోనూ పర్యావరణ స్ఫూర్తిని కొనసాగిస్తోంది. దీంతో సింగరేణి పచ్చదనాన్ని సంతరించుకుంటోందని సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఈ రోజు (ఆదివారం) మినీ ఫారెస్టును డైరెక్టర్ బలరామ్ ప్రారంభించడంతో మరో 500 మెక్కలను నాటారు. సింగరేణిలో నాటే మొక్కలు అప్పటికప్పుడు పచ్చదనం ఇచ్చేవి కాకుండా చింత, ఉసిరి, నేరేడు, మద్ది, జువ్వి, రావి తదితర మొక్కలు నాటి నాటి పర్యావరణం పటిష్టంగా ఉండేలా సింగరేణి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. హరితహార కార్యక్రమంలో భాగంగా సింగరేణిలో ఇప్పటీ వరకు 6 కోట్లకు పైగా మొక్కలు నాటామని వివరించారు.
ఇల్లందు, భూపాలపల్లి ఏరియాల్లో జపాన్‌లో ప్రాచుర్యం పొందిన మియావాకి పద్దతిలో మొక్కల పెంపకాన్ని ప్రారంభించారు. ఈ మొక్కలకు జియో ట్యాగింగ్ చేయించి సంరక్షించడంతో మొక్కులు ఏపుగా పెరిగి చిన్నపాటి అడవులను తలపిస్తోందన్నారు. పర్యావరణ స్రృహను కల్పించేందుకు కృషి చేస్తున్న డైరెక్టర్ బలరామ్ సేవలకు గుర్తింపుగా గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్కాలజీ సంస్థ ఆయన్ను గ్రామోదయ బంధు మిత్ర అవార్డుతో సత్కరించింది, రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ సారధ్యంలోని గ్రీన్ ఛాలెంజ్ సంస్థ కూడా మన మిత్ర పురస్కారాన్ని అందజేసింది. హెచ్‌డీఎఫ్ బ్యాంక్ నైబర్‌హుడ్ హీఆర్ పురస్కారం, భువనేశ్వర్‌లో జరిగిన జియోమైన్ టెక్ అవార్డు కార్యక్రమంలోనూ ఎన్విరాన్‌మెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డు కూడా ఆయన్ను వరించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.