హైదరాబాద్, ఆంధ్రప్రభ : సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం రాష్ట్రంలోని 8 జిల్లాలలో 187 కేంద్రాల్లో రాత పరీక్షను నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నాం 12 గంటలకు ముగిసింది. కాగా, 177 సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించిన పరీక్షకు 77,907 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాతపరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో 79 వాతం అభ్యర్థులు పరీక్షకు హాజరైనారని సింగరేణి అధికారులు పేర్కొన్నారు.
అత్యధికంగా మంచిర్యా జిల్లాలో 89 శాతం హాజరుకాగా, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 64 శాతం మంది హాజరయ్యారు. ఇదిలా ఉండగా, కరీంనగర్ జిల్లాలోని పరీక్ష కేంద్రాలను సింగరేణి సంస్థ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్, హైదరాబాద్లోని పరీక్షా కేంద్రాలను జీఎం సూర్యనారాయణలు పర్యవేక్షించారు. మొత్తం 8 జిల్లాలోని పరీక్ష కేంద్రాలను 200 మందికి పైగా సింరేణి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.