సింగరేణి సంస్థకు జాతీయ స్థాయిలో మరో పురస్కారం లభించింది. 13 దశాబ్దాలుగా బొగ్గు మైనింగ్ రంగంలో అత్యుత్తమంగా వ్యాపారం నిర్వహిస్తున్న సింగరేణి సంస్థకు ప్రతిష్టాత్మకమైన ఇండస్ట్రీ ఎక్స్‌లెన్స్ అవార్డును సొంతం చేసుకున్నది. ఇన్ట్సిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా (ఐఈఐ) ప్రతి ఏటా ఇండస్ట్రీస్ ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రకటిస్తుంది. ఈ అవార్డు కోసం సింగరేణి సంస్థను ఈ ఏడాదికి ఎంపిక చేయగా.. ఐఏఐ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఢిల్లిలో ప్రారంభమైన 36వ ఇండియన్ ఇంజినీరింగ్ కాంగ్రెస్‌లో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే చేతుల మీదుగా సింగరేణి సంస్థ జీఎం నాగభూషణ్‌రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా నాగభూషణ్ రెడ్డి మాట్లాడుతూ.. సంస్థ చైర్మన్ శ్రీధర్ నేతృత్వంలో సింగరేణి కాలరీస్ కేవలం బొగ్గు మైనింగ్ రంగంలోనే కాకుండా 1200 మెగావాట్ల థర్మల్, 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ రంగంలోకి అడుగుపెట్టిందన్నారు. ఇప్పటికే సింగరేణి సంస్థ అనేక అవార్డులను సొంతం చేసుకున్నదని, భవిష్యత్తులోనూ దేశ సేవకు మరింత పునరంకితమై పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి రెసిడెంట్ ఆఫీసర్ ఓజా, ఇండియన్ ఇంజినీరింగ్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ దినేష్‌కుమార్, ఐఈఐ అధికారులు హెచ్‌వో థాకరే, రాజ్‌పుత్, సైలీ, ప్రవీణ్‌కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital