Friday, November 22, 2024

ఒమిక్రాన్ పై సింగ‌పూర్ వైద్యశాఖ అధ్యయ‌నాలు.. ముందు జాగ్ర‌త్త‌లే ముఖ్యం అంటూ ప్రక‌ట‌న‌..

ప్ర‌భ‌న్యూస్ : ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌పై విస్తృతంగా అధ్యయనాలు కొనసాగుతున్నాయని సింగపూర్‌ ఆరోగ్య శాఖ ప్రకటించింది. అన్ని వేరియంట్‌ల కంటే ఒమిక్రాన్‌ ఎంతో ప్రమాదకరమని.. అన్ని చోట్ల ఆందోళనకరమైన విషయాలే వెలుగులోకి వస్తున్నాయని వెల్లడించింది. గత వేరియంట్‌ల కంటే ఎంతో ప్రమాదకరమైందని.. రీ ఇన్‌ఫెక్షన్‌ ముప్పు డెల్టా, బీటా వేరియంట్లతో పోలిస్తే ఎంతో ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్నవారు కూడా ఒమిక్రాన్‌తో రీ ఇన్‌ఫెక్షన్‌ బారినపడే అవకాశాలు ఎక్కువ అని తెలిపింది. అయితే ఒమిక్రాన్‌పై అధ్యయనాలు కొన సాగుతున్నందున.. ఇప్పుడే దీని తీవ్రత, ప్రాణ నష్టంపై అంచనా వేయలేమని వివరించింది.

ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతోందని సింగపూర్‌ ఆరోగ్య శాఖ వివరించింది. ప్రస్తుతం ఉన్న టీకాలు కొంత మేర పని చేస్తాయని, వేరియంట్‌ను అడ్డుకునే శక్తి, సామర్థ్యాలు ప్రస్తుతం ఉన్న టీకాలకు లేదని వివరించింది. రెండు డోసులు తీసుకున్నా.. ఒమిక్రాన్‌ బారినపడకుండా ఉండలేమని స్పష్టం చేసింది. గత వేరియంట్‌తో పోలిస్తే.. లక్షణాల్లో కొన్ని మార్పులు ఉన్నాయని తెలిపింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, మరణాలు అయితే ఇప్పటి వరకు సంభవించలేదని చెప్పుకొచ్చింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ గురించి పూర్తి సమాచారం తెలుసుకునేంత వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మాస్క్‌, సామాజిక దూరం వంటివి పాటించాలని, ఇదే వైరస్‌ వ్యాప్తిని నిరోధిస్తుందని తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement