సింగపూర్: తెలంగాణాలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని, ఆ పరిశ్రమలను తమ రాష్ట్రంలో నెలకొల్పాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు సెమీకండక్టర్ అసోసియేషన్ ప్రతినిధులతో నేడే సమావేశమయ్యారు. ఆ పరిశ్రమల ప్రతినిధులతో చర్చించారు.
రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై వివిధ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. సమావేశంలో ఎస్ఎస్ఎస్ఐఏ చైర్మన్ బ్రియాన్ టాన్, వైస్ఛర్మన్ టాన్ యూ కాంగ్ పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్న పారిశ్రామిక వాతావరణం, ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను ఈ సందర్బంగా తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, తెలంగాణ రాష్ట్రం కీలకమైన కేంద్రంగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. ఎస్ఎస్ఎస్ఐ ప్రతినిధులను తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారు. ఈ ఏడాది చివర్లో హైదరాబాద్ వస్తామని తెలిపారు.