బీడబ్లూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2021లో భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన రెండో రౌండులో స్లవేకియాకు చెందిన మార్టినా రెపిస్కాపై 21-7, 21-9 తేడాతో గెలుపొంది మూడో రౌండులోకి అడుగుపెట్టింది. ఈ విజయంతో మెగాటోర్నీలో సింధు తన ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించింది. కాగా డిఫెండింగ్ ఛాంపియన్ సింధు రెండో రౌండులో గెలిచి టైటిల్ దిశగా దూసుకుపోవడంతో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపింది. గాయం కారణంగా స్పానిష్ స్థార్ షట్లర్ కరోలినా మారిన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ నుంచి వైదొలగడంతో మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా టైటిల్‌ను నిలబెట్టుకోవాలని సింధు ఆశిస్తోంది.
ఈ మ్యాచ్‌లో ఆరంభంలోనే మార్టినా రెపిస్కాపై సింధు 4-1 ఆధిక్యత సాధించింది. అనంతరం రెపిస్కా రెండు పాయింట్లు సాధించినా అప్పటికే సింధు 7-4తేడాతో ముందంజలో నిలిచింది. కేవలం 10నిమిషాల్లోనే 21-7తేడాతో సింధు తొలిసెట్‌ను సొంతం చేసుకుంది. అనంతరం మరో 2నిమిషాల్లోనే సింధు తన ప్రత్యర్థి మార్టినా రెపిస్కాపై 6-0 ఆధిక్యాన్ని సాధించింది. ఈ క్రమంలో ఇక మార్టినా రెపిస్కా కోలుకోలేకపోయింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ సెవెన్ సింధు భారీ ఆధిక్యంతో గెలుపొందింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital