డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు విజయం సాధించింది. గురువారం ఒడెన్స్‌లో జరిగిన రౌండ్-16లో చైనాకు చెందిన నాలుగో సీడ్, ప్రపంచ 7వ ర్యాంకర్ హాన్ యూతో తలపడిన సింధు….. 18-21, 21-12, 21-16 పాయింట్ల తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
కాగా, రేపు (శుక్రవారం) జరిగే క్వార్టర్స్‌లో సింధు… ఇండోనేషియా క్రీడాకారిణి గ్రెగోరియా మరిస్కా తుంజంగ్ లేదా స్థానిక క్రీడాకారిణి మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో తలపడనుంది.