భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తా సాయితో కలిసి సింధు ఏడడుగులు వేసింది. వీరి వివాహం ఆదివారం రాజస్థాన్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రత్యేక అతిథుల మధ్య ఘనంగా జరిగింది.
కాగా, నేడు సింధు, సాయి తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పంచుకున్నారు. చూడముచ్చటగా ఉన్న కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.