Tuesday, November 26, 2024

సింపుల్ గా పూజాహెగ్డే హ్యాండ్ బ్యాగ్ – ఖ‌రీదు తెలిస్తే షాకే

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే బ్యాగ్ ఖ‌రీదు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ మధ్య ఫ్యాషన్ వేర్ లో హాట్ గా దర్శనం ఇచ్చింది పూజా హెగ్డే. అందమైన ముద్దుగుమ్మ ఎదురుగా ఉంటే కెమెరా కళ్లు ఊరుకుంటాయా.. దొరికింతే అదనుగా వరుస ఫోటో షూట్లు చేసుకున్నారు మీడియా జనాలు. ఈ ఫోటోలలో ఆమె హ్యాండ్ బ్యాగ్ కాస్త డిఫరెంట్ గా కనిపనించింది. ఇక ఈ బ్యాగ్ గురించి సోషల్ మీడియా జనాలు ఆరా తీశారు.. దాని కాస్ట్ తెలిసి మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ బ్రాండెడ్ బ్యాగ్ ధర దాదాపుగా లక్షన్నర పైనే ఉంటుందట. ఈ విషయం తెలిసి నెటిజన్లు ఔరా అంటున్నారు. స్టార్ హీరోయిన్ అయ్యాక పూజా హెగ్డే తను వాడే అన్ని వస్తువులు చాలా కాస్ట్లీగా ఉండేట్టు చూసుకుంటుంది..

డ్రెస్సులు, చీరలు, మాత్రమే కాదు.. గాగుల్స్, ఫుట్ వేర్, హ్యాండ్ బ్యాగులు ఇలాంటివన్నీ.. చాలా ఖరీదైనవే వాడుతోంది. పూజా ఉపయోగించే ప్రతి ఒక్కటి అంతర్జాతీయ బ్రాండ్ లు.. అవి అన్నింటికి చాలా ఎక్కువ ధర కలిగి ఉంటాయి.పూజా హెగ్డే ఉపయోగించే లూయిస్ విట్టన్ బ్యాగ్ 2 .6 లక్షలు కావడం విశేషం ..పూజా హెగ్డే గత ఏడాది లాక్మే ఫ్యాషన్ ఈవెంట్ కు హాజరైంది. ఆడవారికి కూడా కన్ను కుట్టేలా లెహంగాలో దేవతలా వచ్చింది పూజా. అయితే ఈ లెహంగా రేటు మాత్రం మైండ్ తిరిగిపోయేలా ఉంది. దాదాపు 2లక్షల విలువైన లెహంగాలో ఈవెంట్ కు వచ్చింది పూజా. ఆ డ్రెస్ లో ఆమె అందరి చూపును తన వైపు తిప్పుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement