Sunday, November 24, 2024

మే 23న మార్కెట్లోకి సింపుల్‌ వన్‌ ఇ-స్కూటర్‌

బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్‌ కంపెనీ సింపుల్‌ ఎనర్జీ కీలక ప్రకటన చేసింది. సింపుల్‌ వన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని మే 23 న అధికారికంగా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల బ్యాటరీలో ఏర్పడిన లోపల వల్ల కొన్ని కంప్లేంట్స్‌ వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో కంపెనీ సింపుల్‌ వన్‌ స్కూటర్‌ను మరింత నిశితంగా పరిశీలిస్తూ విడుదల చేయడంలో కొంత ఆలస్యం చేసింది.

ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌ సవరణ 3 ప్రవేశపెట్టిన తరువాత మెరుగైన బ్యాటరీ భద్రతలను కలిగి ఉన్న స్కూటర్లలో సింపుల్‌ వన్‌ ప్రధానంగా చెప్పుకోదగ్గదిగా మారింది. కొత్త సింపుల్‌ వన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మంచి డిజైన్‌ కలిగి ఆధునిక ఫీచర్స్‌ పొందుతుంది. సింగిల్‌ ఛార్జ్‌తో గరిష్టంగా 236 కిమీ రేంజ్‌ అందిస్తుందని కంపెనీ గతంలోనే ధ్రువీకరించింది. సింపుల్‌ వన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇప్పటికే మంచి సంఖ్యలో బుకింగ్స్‌ కూడా పొందింది. డెలివరీలు కూడా వేగంగానే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement