Monday, November 18, 2024

భక్తులు లేకుండానే సింహాద్రి అప్పన్న చందనోత్సవం

సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారు నిజరూపంఓ దర్శనమిచ్చారు. కరోనా నేపథ్యంలో పరిమిత వైదిక సిబ్బందితో ఉత్సవ నిర్వహణ చేపట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. చందనోత్సవ ఘట్టాన్ని ఏకాంతంగా జరిపారు. దీంతో వరుసగా రెండో ఏడాది  స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభించని పరిస్థితి నెలకొంది. అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులకు, ధర్మ కర్తల మండలి చైర్ పర్సన్ సంచయితకు తొలి దర్శనం కల్పించారు. స్వామి వారికి ప్రభుత్వం తరుపున మంత్రి అవంతి శ్రీనివాసరావు పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రజా ప్రతినిధులు, పాలక మండలి సభ్యులు, అధికారులకు కూడా దర్శనానికి అనుమతి నిరాకరించారు. అప్పన్న చందనోత్సవం నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్ల చేశారు. మొత్తం 120 మందికే పాసులు ఇచ్చారు.

ప్రతి ఏటా చందనోత్సవం అంగరంగ వైభవంగా జరిగేది. లక్షలాది మంది భక్తులు స్వామి నిజరూపాన్ని కనులారా దర్శించుకునేవారు. కరోనా కేసులు తీవ్రతతో గత సంవత్సరం లాగే ఈ ఏడాదీ భక్తుల సందడి లేకుండా కార్యక్రమాన్ని జరిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement