దక్షిణకొరియా చాంగ్వాన్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) వరల్డ్ కప్ రైఫిల్/పిస్టోల్/షాట్‌గన్ స్టేజ్‌లో భారత్ బృందం అద్భుతంగా రాణిస్తోంది. దీంతో పతకాల పట్టిక టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు భారత్ బృందం 5 గోల్డ్, 6 సిల్వర్, 4 బ్రోంజ్ మెడల్స్ సాధించింది. వరల్డ్ కప్ ఆఖరిరోజు బుధవారంనాడు మెన్స్ 25 మీటర్ల రాపిండ్ ఫైర్ పిస్టోల్ (ఆర్‌ఎఫ్‌పీ) టీమ్ ఈ వెంట్ ఫైనల్‌లో చెక్ రిపబ్లిక్ బృందం చేతిలో 15-17 తేడాతో భారత త్రయం అనీష్ భన్వాలా, విజయ్‌వీర్ సిధ్, సమీర్ వెనకబడ్డారు.
దీంతో వెండి పతకంతో సరిపెట్టుకున్నారు. తొలి రెండు రౌండ్లలో భారత్ త్రయం తొలి రౌండ్‌లో 872 పాయింట్లతో అగ్రస్థానం చేజిక్కించుకోగా, రెండో రౌండ్‌లో 578 పాయింట్లు సాధించి గోల్డ్ మెడల్ రౌండ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇక మరో ఈవెంట్‌లో భారత్ జోడీ మాయ్‌రాజ్ అహ్మద్ ఖాన్, ముఫద్దాల్ దీస్‌వాలా 138/150తో వెనకబడి పతకం లేకుండానే వెనుదిరిగింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.