Saturday, November 9, 2024

Fire Crackers: ఢిల్లీలో నిశ్శబ్ద దీపావళి.. ఫైర్ క్రాక‌ర్స్‌పై ఆప్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

దీపావళి టపాసులపై ఢిల్లి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి దీపావళి పటాకులపై వచ్చే ఏడాది, జనవరి 1వ తేదీ వరకు నిషేధం విధిస్తున్నట్లు పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ బుధవారం ఢిల్లిలో ప్రకటించారు. గతేడాది మాదిరిగా ఈ సంవత్సరం ఢిల్లి ప్రజలు ప్రమాదకరమైన కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు అన్ని రకాల దీపావళి మందులు, టపాసుల తయారీ, నిల్వ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించినట్లు మంత్రి వెల్లడించారు.

దీపావళి మందులపై పూర్తి నిషేధం విధించడం వల్ల ప్రజల ప్రాణాలను కాపాడటం జరుగుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఆన్‌లైన్‌ అమ్మకాలు, డెలివరీపై కూడా నిషేధం విధించినట్లు మంత్రి వెల్లడించారు. దసరా, దీపావళికి కేవలం ఒక్క నెల రోజుల సమయం మాత్రమే ఉండగా, ఈ దశలో ప్రభుత్వం నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది కూడా ఆప్‌ ప్రభుత్వం దీపావళి పటాకులపై నిషేధం విధించింది. ఉల్లంఘించిన వారికి రెసిడెన్షియల్‌ జోన్‌లో రూ. 10 వేల వరకు, నిశ్శబ్ద జోన్‌లో రూ. 20 వేల వరకు జరిమానాలు విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement