Saturday, November 23, 2024

TS | సైలెంట్‌గా సైబర్‌ నేరాలు.. ఇ-చలాన్‌ పేరిట చీటింగ్‌

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌ : సైబర్‌చీటర్స్‌ సామాన్య జనాలను దోచుకునేందుకు ఎప్పటికప్పడు కొత్తపుంతలు తొక్కుతూనే ఉన్నారని సైబర్‌ నిపుణులు ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. వినియోగదారుల సొమ్మును కాజేసేందుకు ఆర్థిక నేరాలలో ఆరితేరిన సైబర్‌ నేరస్తులు సైలెంట్‌గా కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని వివరిస్తున్నారు. తాజాగా ఇటీవల కాలంలో పెండింగ్‌ చలాన్‌లను తగ్గిస్తూ ప్రభుత్వం ప్రకటించడంతో సైబర్‌ నేరస్తులు చీటింగ్‌ చేసేందుకు రంగం సిద్థం చేసుకుంటున్నారు. తాజాగా ట్రాఫిక్‌ చలాన్‌లకు సంబంధించి ఈ చలాన్‌ పేరిట కొత్తరకం మోసం మొదలైంది.

ఇ చలాన్‌ పేరుతో వాహన చోదకులకు వ్యక్తి గత సందేశాలు పంపి టోకరా వేస్తున్నారని, సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. తాజాగా సర్కరు ట్రాఫిక్‌ చలాన్‌లను తగ్గించడంతో సైబర్‌ నేరస్థులు ఇ చలాన్‌ల పేరుతో వ్యక్తిగత సందేశాలు పంపుతూ అందులోనే పేమెంట్‌ సైతం ఉంచుతున్నారు. ఈ సందేశం చూసిన వారు నిజమేననుకుని ఆ లింక్‌పై క్లిక్‌ చేస్తే వారి బ్యాంక్‌ ఖాతాల వివరాలు హాక్‌ కావడంతో పాటు ఖాతాలలోని నగదు మాయం ఖావడం జరుగుందని పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.

వాస్తవంగా ఇలా ఉంటాయి ..

- Advertisement -

ఇ-చలాన్‌ల పేరిట వచ్చే సందేశాలలో వాహనం నంబర్‌, ఇంజిన్‌, చాసిస్‌ నంబర్‌ వంటి వివరాలు ఉంటాయి. అయితే సైబర్‌ కేటుగాళ్లు పంపే మెసేజ్‌లలో ఈ వివరాలేమీ ఉండవని, అలాగే ఈ తరహా సందేశాలు మొబైల్‌ ఫోన్ల నుంచి రావన్న విషయాలను వాహన దారులు గుర్తించాలని సైబర్‌ నిపుణులు కోరుతున్నారు. అంతేకాకుండా ఈ తరహా సందేశాలు వచ్చిన సమయంలో పోలీసు అధికారులు సూచించిన అధికారిక వెబ్‌సైట్‌కు వె ళ్లి పరిశీలించుకోవాలని వివరిస్తున్నారు.

ప్రభుత్వం మరోసారి ట్రాఫిక్‌ విభాగంలో పెండింగ్‌ చలాన్‌ల తగ్గిస్తూ బంపర్‌ ఆఫర్‌ ఇవ్వడంతో సైబర్‌ కేటుగాళ్లు చలాన్‌ల పేరిట చీటింగ్‌లకు పాల్పడే అవకాశం ఉందని పోలీసు అధికారులు ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. ఇ- చలాన్‌కు సంబంధించిన వెబ్‌ సైట్‌ను పోలిన వెబ్‌సైట్‌తో నేరగాళ్లు మెసాలకు పాల్పడుతున్నారని, ఈ క్రమంలోఎవరైన వీరి బారిన పడి మోసపోతే వెంటనే క్రైం విభాగానికి, బ్యాంక్‌కు తొలుత సమాచారం ఇచ్చి ఆనంతరం సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సదరు సైబర్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

ఇదో రకం మోసం

వినియోగదారులు క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసే విషయంలో ప్రజలు అప్రతమ్తంగా ఉండాలని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాధితుల నుంచి నగదు కాజేసేందుకు స్కామర్లు నకిలీ క్యూ ఆర్‌కోడ్‌లను తయారు చేసి అమాయలకును దోచుకుంటున్నారని తెలిపారు. ముఖ్యంగా నగదు చెల్లింపులు, నగదు తీసుకునే సమయంలో స్కామర్లను పంపిన నకిలీ క్యూ ఆర్‌కోడ్‌ను స్కాన్‌ చేసి పలువురు ఆర్థికంగా మోసపోతున్న ఘటనలు చోట చేసుకుంటున్నాయి.

స్కామర్లు పంపిన కోడ్‌ను స్కాన్‌ చేసి ఒటిపి ఎంటర్‌ చేయగానే తమ ఖాతాల నుంచి డబ్బు డిడక్ట్‌ అయినట్లు మెసేజ్‌ వస్తుండటంతో మోసపోయిన వారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో దాదాపు 60శాతం వినియోగ దారులు కేవలం క్యూ ఆర్‌కోడ్స్‌ ద్వారా, ఆన్‌లైన్‌ చెల్లింపులు చేపడుతుండటంతో సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌ వేదికగా నేరాలకు పాల్పడుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వినియోగదారులు యుపిఐ ఐడి, బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఒటిపిలు కొత్త వ్యక్తులతో పంచుకోరాదని, ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు చేసే ముందు ఎవరికి చెల్లింపులు (విక్రేత) చేస్తున్నారో వారి వివరాలు పరిశీలించాలని సైబర్‌ నిపుణులు వివరిస్తున్నారు. అలాగే ఇదివరకే ఉన్న కోడ్స్‌పై అతికించిన స్టిక్కర్లు తదితర అనుమానిత క్యూ ఆర్‌కోడ్‌లను వినియోగించకపోవడమే మంచిదని వివస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement