Saturday, November 23, 2024

కాలేజీల్లో సిక్కులు కిర్పాన్‌ ధరించవచ్చు.. అమెరికా ప్రభుత్వం అనుమతి

అమెరికాలో చదువుతున్న సిక్కు విద్యార్థులకు కిర్పాన్‌ విషయంలో అమెరికా ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. విద్యాసంస్థల్లో కిర్పాన్‌ను ధరించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అమెరికా విద్యావిధానంలో తీసుకొచ్చిన మార్పుల మేరకు వెసులుబాటును కల్పించింది. రెండు నెలల క్రితం కిర్పాన్‌ ధరించి కాలేజీకి వచ్చిన విద్యార్థినొకరిని అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. దాంతో విద్యావిధానంపై ప్రభుత్వం సమీక్ష జరిపింది. అమెరికాలో వెపన్స్‌ ఆన్‌ క్యాంపస్‌ పాలసీని నిక్కచ్చిగా అమలుచేస్తున్నారు.

ఇటీవల జరిగిన సంఘటన నేపథ్యంలో ఈ పాలసీపై సమీక్ష జరిపిన అధికారులు అప్‌డేట్‌ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కొత్త పాలసీ ప్రకారం కిర్పాన్‌ పొడవు 3 అంగుళాల కంటే తక్కువగా ఉండాలి. సిక్కు కూటమి, గ్లోబల్‌ సిక్కు కౌన్సిల్‌తో పాటు పలువురు సిక్కు నాయకులతో చర్చించిన మీదట పాత విధానానికి మార్పులు చేసినట్లు అమెరికా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement