Wednesday, November 20, 2024

సిద్దూ ఆస్తులు రూ.44 కోట్లు, ఎన్నికల అఫిడవిట్‌లో వెల్ల‌డి..

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు సిద్దూ శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. అమృత్‌సర్‌ తూర్పు నుంచి పోటీ చేస్తున్నారు. విద్యార్హతలు, ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇందులో ప్రస్తావించిన వివరాల ప్రకారం.. సిద్దూకు భారీగా ఆస్తులు ఉన్నాయి. నామినేషన్‌ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో సిద్దూ మొత్తం ఆస్తుల విలువ రూ.44.63 కోట్లుగా ప్రకటించారు. ఇందులో అతని భార్య, మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్‌ కౌర్‌ సిద్దూ రూ.3.28 కోట్లు సహా.. రూ.41.35 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో (2016-2017)లో తన వార్షిక ఆదాయం రూ.94.18 లక్షలు ఉండగా.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.22.58లక్షలకు తగ్గిందని పేర్కొన్నారు. చరాస్తులను గమనిస్తే.. చరాస్తుల్లో రూ.1.19 కోట్లు విలువైన రెండు టయోటా ల్యాండ్‌ క్రూయిజర్లు ఉన్నాయి. రూ.11.43 కోట్లు విలువ చేసే టయోటా ఫార్చ్యూనర్‌ వాహనంతో పాటు రూ.30లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి. రూ.44 లక్షలు విలువ చేసే వాచీలు ఉన్నాయి.

ఆయన భార్యకు రూ.70లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి. వ్యవసాయ భూముల్లేవు. పటియాలలో ఆరు షోరూంలు ఉన్నాయి. పాటియాలలో రూ.1.44 కోట్లు విలువైన 1,200 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న తన నివాస గృహాన్ని, వారసత్వంగా వచ్చిన ఆస్తి అని సిద్ధూ ప్రకటించారు. అతను అమృత్‌సర్‌లో సుమారు రూ.34 కోట్ల విలువైన 5,114 చదరపు గజాల నివాస ఆస్తి కూడా ఉందని తెలిపారు. 1986లో పాటియాలలో పంజాబీ వర్సిటీ నుంచి బీఏ పూర్తి చేశాడు. ఎమ్మెల్యేగా తనకు అందుతున్న జీతం, అద్దె ఆదాయం, బీసీసీఐ నుంచి వస్తున్న పెన్షన్‌లను తన ఆదాయ వనరులని ప్రకటించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement