పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ కు పీసీసీ సారథి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి అల్టిమేటం ఇచ్చారు. ఈసారి డ్రగ్స్ అంఅంశంపై తాజాగా సిద్దూ స్పందించారు. రాష్ర్టంలో మాదకద్రవ్యాల సమస్య తీవ్ర రూపం దాల్చిందని, దీనిపై విచారణ జరిపిన ప్రభుత్వసంస్థలు నివేదిక ఇచ్చాయని, ఆ నివేదికను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిందని, అయితే అందులోని వివరాలను ప్రజలకు బహిర్గతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని సిద్దూ అభిప్రాయపడ్డారు.
ఆ నివేదిను బహిర్గతం చేయకపోతే తాను నిరాహారదీక్ష చేపడతానని సిద్దూ హెచ్చరించారు. రాష్ర్టంలో డ్రగ్స్ సమస్యను రూపుమాపుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చామ నని గుర్తు చేసిన ఆయన మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఈ నివేదికను తొక్కిపెట్టారని, ఇప్పుడు వాటిని బహిర్గతం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చన్నీపై ఉందని అన్నారు. గత ముఖ్యమంత్రి అమరీందర్ తో నిత్యం ఘర్షణ పడుతూనే వచ్చిన సిద్దూ చివరకు పీసీసీ పగ్గాలు చేపట్టారు. ఆ తరువాత అమరీందర్ నిష్ర్కమించడం, చన్నీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే.
తన మద్దతుతోనే అధికారం చేపట్టినప్పటికీ కేబినెట్ మంత్రుల ఎంపిక, డీజీపీ, అడ్వకేట్ జనరల్ పదవుల భర్తీలో తన మాటకు విలువ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సిద్దూ పీసీసీ అధ్యక్షుడిగా రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. ఆ తరువాత సీఎం వెనక్కు తగ్గడంతో పార్టీ పగ్గాలు వదల్లేదని రాజీకొచ్చారు. ఆ తరువాత కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ అయి 1 అంశాల ప్రాతిపదికగా పంజాబ్ లో తీసుకోవలసిన చర్యలపై ఓ నివేదిక ఇచ్చారు. ఇప్పుడు డ్రగ్స్ అంశాన్ని లేవనెత్తి చన్నీకి మరో హెచ్చరిక చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..