Tuesday, November 26, 2024

Siddipet : బిడ్డ మంచిగ చదుకోవాలి.. మంత్రి హరీష్ రావు సార్ ఉత్తరం పంపిండు!!

” మీ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించేందుకు మీ శ్రమ వెల కట్టలేనిది.. పిల్లలకు నాణ్యమైన విద్య అందితేనే వారి భవిష్యత్తు బాగుటుంది.. మీ విద్యార్థులు జీవితంలో పదవ తరగతి కీలకమైనది. వారి భవిష్యత్తుకు పునాదులు వేశే వార్షిక పరీక్షలు సమీపిస్తున్నవి…” అనే మంత్రి మాటలు…” మాలో స్పూర్తి నింపాయి.. మా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి.. చదవాలి అనే తపనను కలిగించిందిష‌ అని పదవ తరగతి విద్యార్థులు తల్లిదండ్రులు మోహల్లో ఆనందం వెల్లువెరుస్తున్నాయ్..

ఇటీవల మంత్రి హరీష్ రావు పదవ తరగతి ఉత్తీర్ణత పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాదించే దిశగా ప్రతి పాఠశాల పై జిల్లా స్థాయిలో రెండుసార్లు సమీక్షా నిర్వహించారు.. ఉపాధ్యాయులకు ఎంత బాధ్యత ఉందో.. ప్రజలకు ప్రభుత్వ పాఠశాల పై నమ్మకం పెరిగింది. అందుకు విద్యార్థులు తల్లిదండ్రులుకు బాధ్యత పెంచాలి అని.. వారి పిల్లలను ఉత్తమ ఫలితాలు సాధించాలని చదివించే దిశగా అడుగులు వేయాలని మంత్రి హరీష్ రావు నూతన ఒరవడికి శ్రీకారాం చుట్టారు.. పదవ తరగతి విద్యార్థులు ఇంటింటికి వారి తల్లిదండ్రులకు ఉత్తరం చేర వేశారు.

ఆ విద్యార్థులు తల్లితండ్రుల్లో ఆనందం వెల్లువిరిసి.. మంత్రి హరీష్ రావు మా పిల్లలపై చూపిస్తున్న శ్రద్ధ‌ పై ముగ్దుల్లయ్యరు..” దండలయ్య.. మాకు నువ్ ఉండాలయ్య” ఒక గురువుల.. ఒక తండ్రిల.. ఒక అన్నల, ఒక కొడుకులా.. మాకు మనోధైర్యం ఇచ్చారు.. మా పిల్లల భవిష్యత్తుకు పునాది వేశారు.. మీరు పంపిన ఉత్తరం మాలో, మా పిల్లల్లో ఉత్తమ ఫలితాలను సాధించే ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపారు.. అని ఆనందం వ్యక్తం చేసారు. మీరు పంపిన ఉత్తరంతో మా బిడ్డ మంచిగా చదివి ఉత్తీర్ణత సాధించి మిమ్మల్ని కలుస్తాం అని వారి మాటల్లో చెప్పారు.

మంత్రి ఉత్తరం తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో ఉత్సాహన్ని నింపింది అని.. మంత్రి ఆశయం 100% ఉత్తీర్ణత దిశగా మాలో నూతనోత్సహం కలిగించింది అని విద్యార్థులు.. తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి హరీష్ రావుకి కృతఙ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement