మరోసారి వార్తల్లో నిలిచారు నటులు సిద్ధార్థ్.. అదితి రావు హైదరి.వీరిద్దరూ కలిసి ఓ పాటకు స్టెప్పులేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ‘ఎనిమీ’ సినిమాలోని ‘టమ్ టమ్’ అనే పాటకు వీరిద్ధరూ కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను అదితి స్వయంగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో పలువురు నెటీజన్లు ‘త్వరలో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టండి’. ‘లేటెందుకు మీ జోడీ చాలా బాగుంది..పెళ్లి చేసుకోండి’. ‘ఎప్పుడు మీ పెళ్లి శుభవార్త చెబుతారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమ్మోహనం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అదితి తొలి సినిమాతోనే అందరి మనసు దోచుకుంది. క్యూట్‌లుక్స్‌తో, కట్టిపడేసే నటనతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సిద్ధార్థ్ ఇప్పుడంటే కాస్త డల్ అయ్యాడు గానీ, అప్పట్లో టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగాడు. ‘బొమ్మరిల్లు’, ‘నువ్వస్తానంటే నేనొద్దంటానా’ వంటి సినిమాలతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక వీరిద్ధరూ త్వరలోనే వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. కాగా వీరిద్ధరికి ఇదివరకే వేరువేరుగా పెళ్లిళ్లు అయి విడాకులు కూడా తీసుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement