ఐపీఎల్ 2023.. 16వ సీజన్లో భాగంగా ఇవ్వాల రాత్రి గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్ లోని స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో మెదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టింది హైదరాబాద్ టీమ్. కాగా, బ్యాటింగ్ కు దిగాన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. హైదరాబాద్ ముందు 189 పరుగుల టార్గెట్ ని సెట్ చేసింది.
గుజరాత్ టీమ్ లో శుభమాన్ గిల్ తన మెరుపు ఇన్నింగ్స్ తో శతకం బాదాడు. అయితే గుజరాత్ తరుఫున మెదట బ్యాటింగ్ కు దిగిన వృద్ధిమాన్ సాహా ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయ్యాడు. అప్పుడు సాయి సుదర్శన్ బరిలోకి వచ్చాడు. శుభమాన్, సాయి సుదర్శన్ కలిసి స్కోరును భారీగా పెంచేశారు. అయితే 15వ ఓవర్లో సాయి సుదర్శన్ 36 బంతుల్లో 47 పరుగులతో (6-1, 4-6) అవుట్ అయ్యాడు. శుభమాన్ గిల్ 58 బంతుల్లో 101 పరుగులు (6-1 , 4-13) చేసి సెంచరీతో ఆకరి ఓకర్ లో అవుట్ అయ్యిడు.
ఇక హార్దిక్ పాండ్యా 6 బంతుల్లో 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆపై వచ్చిన మిల్లర్ కూడా 7 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. రాహుల్ తెవాటియా కూడా అదే విధంగా 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివరి ఓవర్లో వచ్చిన రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ డక్ అవుట్ అయ్యారు. నాలుగు వికెట్లు తీసిన భువనేశ్వర్.. ఒకే ఓవర్లో వరుసగా మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. ఇక మెత్తంగా గుజరాత్ జట్టు 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి.. హైదరాబాద్ ముందు 189 పరుగుల టార్గెట్ ని సెట్ చేసింది. ఈ టార్గెట్ ను చేజ్ చేసేందుకు మరి కొద్ది సేపట్లో హైదరాబాద్ జట్టు బరిలోకి దిగనుంది.