Tuesday, November 19, 2024

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ద‌క్కించుకున్న శుభ్‌మన్ గిల్..

ఇండియన్ టీమ్ తరఫున నిలకడగా రాణిస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ ప్లెయ‌ర్ శుభ్‌మన్ గిల్. మూడు ఫార్మాట్లలోనూ భారీగా పరుగులు సాధించిన వ్య‌క్తిగా రికార్డుల్లో త‌న పేరును లిఖించునున్నాడు. ముఖ్యంగా పోయిన నెల‌ జనవరిలో జ‌రిగిన‌ వన్డే, టీ20 మ్యాచ్ ల‌లో గిల్ చెలరేగిపోయాడు. దీంతో తాజాగా ఐసీసీ ప్రకటించిన ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు అతన్ని వరించింది.

శ్రీలంక, న్యూజిలాండ్ తో జ‌రిగిన మ్యాచ్ ల‌లో భార‌త్ గెలుపుకై గిల్ మంచి కృషి చేశాడు. మొత్తానికి అన్ స్టాప‌బుల్ యాటిట్యూడ్ తో త‌ను బాదిన సెంచ‌రీలు ఇండియన్ టీమ్ కు సిరీస్ లు సాధించి పెట్టింది. న్యూజిలాండ్ సిరీస్ లో భాగంగా హైదరబాద్ లో జరిగిన తొలి మ్యాచ్ లో గిల్ డబుల్ సెంచరీ చేసి వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. మొత్తంగా మూడు సెంచరీలతోపాటు జనవరి నెలలో శుభ్‌మన్ గిల్ 567 రన్స్ చేయడం విశేషం.

కాగా, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం గిల్ తో పాటు సిరాజ్, డెవోన్ కాన్వే కూడా పోటీ పడ్డారు. గతేడాది అక్టోబర్ లో విరాట్ కోహ్లి తర్వాత ఈ అవార్డు అందుకున్న ఇండియన్ ప్లేయర్ గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఇక ఐసీసీ వుమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఇంగ్లండ్ కు చెందిన గ్రేస్ స్క్రీవెన్స్ కు దక్కింది. ఈ అవార్డు గెలుచుకున్న అత్యంత పిన్న వయసు ప్లేయర్ గా ఆమె నిలిచింది. అండర్ 19 వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో ఆమె నిలకడగా రాణించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement