బీహార్లోని నలంద జిల్లా కులూ గ్రామంలో శుభ్మన్ కుమార్ అనే మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి నిరుపయోగంగా ఉన్న 40 అడుగుల లోతు బోరుబావిలో పడిపోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వెంటనే అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బోరుబావిలోకి కెమెరాను పంపించి ఆ బాలుడు ప్రాణాలతోనే ఉన్నాడని గుర్తించారు.
ఇక జేసీబీల సాయంతో బోరుబావికి సమాంతరంగా గుంత తీసి బాలుడిని రక్షించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు రెస్క్యూ ఆపరేషన్ అధికారులు. ఉండయం నండి దాదాపు 5 గంటలపాటు శ్రమించగా.. బాలుడిని సురక్షితంగా బయటకు తీయగలాగారు అధికారులు. ఆ తరువాత వెంటనే చికిత్స నిమిత్తం ఆ బాలుడిని నలందలోని ఓ ఆస్పత్రికి తరలించారు అధికారులు.