Saturday, November 23, 2024

శ్రీరామ్‌ గ్రూప్‌ మూడు కంపెనీలు మ‌ర్జ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌..

శ్రీరామ్‌ కంపెనీలన్నీ కలిపి ఒక మెగా కంపెనీగా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్టు కీలక ప్రకటన చేసింది. శ్రీరామ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌.. దేశంలోనే అతిపెద్ద రిటైల్‌ ఫైనాన్స్‌ ఎన్‌బీఎఫ్‌సీని ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్నట్టు తెలిపింది. మూడు కంపెనీలను విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. మూడు కంపెనీల బోర్డులు.. శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ (ఎస్‌టీఎఫ్‌సీ), శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌ (ఎస్‌సీయూఎఫ్‌), ప్రమోటర్‌ శ్రీరామ్‌ క్యాపిటల్‌ (ఎస్‌సీఎల్‌), ఎస్‌సీయూఎఫ్‌లను, ఎస్‌టీఎఫ్‌సీలో విలీనానికి ఆమోదించినట్టు పేర్కొంది.

శ్రీరామ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌గా పిలవబడే విలీన సంస్థ దేశంలోనే అతిపెద్ద రిటైల్‌ ఫైనాన్స్‌ ఎన్‌బీఎఫ్‌సీ అవుతుందని తెలిపింది. విలీనమైన సంస్థ నిర్వహణలో.. కలిపి రూ.1.5లక్షల కోట్లు విలువ చేసే ఆస్తిని కలిగి ఉంటుందని కంపెనీ వివరించింది. ఈ విలీనం ఎస్‌సీఎల్‌, ఎస్‌సీయూఎఫ్‌, ఎస్‌టీఎఫ్‌సీ వాటాదారుల ఆమోదం, ఇతర నియంత్రణ ఆమోదాలకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement