ఆధాయం 08 వ్యయం 11
రాజ్య పూజ్యం – 01, అవమానం – 02
గురువు 22.3.2023 ఉగాది నుండి 21.4.2023 వరకు మీనరాశి 1వ స్థాన మై సాధారణ శుభుడైనందున వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటు-ంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తపడుట మంచిది. 22.4.2023 నుండి వత్సరాంతం వరకు మెెషరాశి 2వ స్థానమై శుభుడైనందున ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు.కుటు-ంబ సౌఖ్యముంటు-ంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటు-ంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా
నెరవేర్చుకుంటారు.
శని 22.3.2023 ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కుంభరాశి 12వ స్థానమై అశుభుడైనందున అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
రాహువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు మేషరాశి 2వ స్థానమై సాధారణ శుభుడైనందున ఆకస్మిక ధనలాభయోగముంటు-ంది. కుటు-ంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణ మేర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.31.10.2023 నుండి వత్సరాంతం వరకు మీనరాశి 1వ స్థానమై సాధారణ శుభుడైనందున విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటు-ంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటు-ంది. అనారోగ్యబాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
కేతువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు తులారాశి 8వ స్థానమై అశుభుడైనందున అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది.31.10.2023 నుండి వత్సరాంతం వరకు కన్యారాశి 7వ స్థానమై సాధారణ శుభుడైనందున అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నాసత్ఫలితాలు పొందుతారు.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాల-కై-
వేచివుంటారు. దైవదర్శనం లభిస్తుంది.