Friday, November 22, 2024

చై..నా.. మహా దగా!

ప్రభ న్యూస్‌ బ్యూరో, ఉమ్మడి మెదక్‌ : శ్రీ చైతన్య- నారాయణ జూనియర్‌ కళాశాలలు నిబంధనలకు విరుద్దంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి చై..నా డేస్కా లర్స్‌ కళాశాలల నిర్వహణ పేరుతో ఇంటర్మీ డియట్‌ బోర్డు నుండి అనుమతులు పొంది రెసిడెన్షియల్‌ కళాశాలలను నిర్వహిస్తుంది. ఇది పూర్తిగా చట్ట విరుద్దం అయినప్పటికీ శ్రీ చైతన్య- నారాయణ జూనియర్‌ కళాశాలల విషయంలో ఇంటర్మీడియట్‌ బోర్డు చూసిచూడనట్లు వ్యవహరిస్తుంది. ఫలితంగా ఇరుకు గదుల్లో విద్యార్థులు తమ కౌమార జీవితాన్ని గడుపాల్సి వస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, సరైన వెలుతురు లేకుండానే తరగతి గదుల నిర్వహణ సాగుతుంది. ఒక్కో క్యాంపస్‌లో వేలాదిమంది విద్యార్థులను నింపేస్తున్న చై..నా బ్యాచ్‌ అందు కనుగుణంగా నాణ్యతా ప్రమాణాలను పాటించ డం లేదు. ముఖ్యంగా ఫ్లోర్‌ వైజ్‌ వాష్‌రూమ్స్‌ నిర్వహించడం లేదు. ఒక్కో ఫ్లోర్‌లో 5 టాయి లేట్స్‌- 5 వాష్‌రూమ్స్‌ వరకు మాత్రమే అందుబా టులో ఉంటున్నాయి. దీంతో విద్యార్థులు స్నానా లతో పాటు వాష్‌రూమ్స్‌ వెళ్లాలన్నా క్యూ లైన్లలో నిల్చోవాల్సిందే. చాలా కళాశాలల్లో డైనింగ్‌ సెల్లా ర్లలోనే నిర్వహిస్తున్నారు. ఇది కూడా నిబంధ నలకు విరుద్దమే. ఇలా నిబంధనలను తుంగలో తొక్కి విద్యావ్యాపారం చేస్తున్న చైనా అడుగులకు ఇంటర్మీడియట్‌ బోర్డు మడుగులు వత్తుతున్నట్లు ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

నో ఫైర్‌ సేప్టీ..
శ్రీ చైతన్య- నారాయణ కళాశాలలు డేస్కాలర్స్‌ కళాశాలల నిర్వహణ పేరుతో రెసిడెన్షియల్‌ కళా శాలలు నిర్వహిస్తున్న కారణంగా పాటించాల్సిన నిబంధనలకు మంగళం పాడుతుంది. ఆయా కళాశాలల భవనాల నిర్మాణం పూర్తిగా నిబంధ నలకు విరుద్దంగానే ఉంటాయి. అగ్నిప్రమాద నివారణ చర్యలు అసలే పాటించరు. భవనాలకు ఎగ్జిట్‌ వే (బయటి నుండి మెట్లు) అసలే ఉండవు. వేలాది మంది విద్యార్థులున్న క్యాంపస్‌లో ఏదేని అగ్ని ప్రమాదం జరిగితే ఆయా క్లాస్‌ రూంల నుండి విద్యార్థులను సురక్షితంగా బయటకు పంపాలంటే ఎగ్జిట్‌ వే లేని కారణంగా విద్యార్థులు ప్రమాదంలో చిక్కుకుపోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఇక ఆయా కళాశాలల్లో లిఫ్టులు న్నా అవి ఆఫ్‌ చేసి పెడుతారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే వినియోగిస్తారు.

నో ప్లే ఏరియా – నో మెడిటేషన్‌ క్లాసెస్‌..
డేస్కాలర్‌ కళాశాలలతో రెసిడెన్షియల్‌ కళాశాలల నిర్వహణ కారణంగా చై..నా బ్రాంచ్‌లలో ప్లే ఏరియా కానరాదు. దీంతో విద్యార్థులు కాసే పు ఉల్లాసంగా సేదతీరుదామన్న కష్టమే. ఇక ఉదయం 5 గంటల నుండి రాత్రి 10:30 నిమిషాల వరకు ప్రత్యేక తరగతులు – రీడింగ్స్‌ అంటూ ర్యాంకుల కోసం విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెంచు తారు. ఈ క్రమంలో విద్యార్థుల మానసికోల్లా సానికి యోగా లేదా మెడిటేషన్‌ క్లాస్‌లు తీసు కోవాలని నిబంధనలను చెబుతున్నా చై..నా మా త్రం పట్టించుకోదు. ఇలా అన్ని రకాలుగా చై..నా నిబంధనలను తుంగలో తొక్కి తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకుంటూ పోతుంది. ఫలితంగానే ప్రతి సంవత్సరం విద్యార్థులు మానసిక ఒత్తిడో లేక బందీఖానా అయ్యామనో లే క ఇతరత్రా కారణాల వల్ల చైనా తరగతి గదుల్లో ఉరికంబాలు ఎక్కుతున్నారు. ఇలాంటి హృదయ విదారక ఘటనలు చోటుచేసుకుంటున్నా ఇంటర్మీ డియట్‌ బోర్డు ఏమాత్రం తూతూమంత్రపు చర్యలు తప్పితే ఒక్క బ్రాంచ్‌నైనా మూయించిన దాఖలాలు లేవు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఉసురు తలగకముందే ఇంటర్మీడియట్‌ బోర్డు మే ల్కొని చై..నా కళాశాలలపై తనిఖీలు చేపట్టి నిబం ధనలకు విరుద్దంగా ఉన్న కళాశాలలను మూసివే యించాలని సర్వత్రా డిమాండ్‌ చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement