భారత్ గడ్డపై టీ20ల్లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ధర్మశాల వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచున్న భారత్ ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన భారత్ జట్టు 7 వికేట్ల తేడాతో 186 పరుగులు చేసి ఘన విజయాన్ని సాదించింది. సంజూ శాంసన్ 39(25), రవీంద్ర జడేజా 45(18) బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించగా శ్రేయాస్ అయ్యర్ 74*(44) 186 పరుగులతో 184 పరుగుల లక్ష్యాన్ని 17 బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు. దుష్మంత చమీర రోహిత్ శర్మను 1 పరుగుల వద్ద అవుట్ చేయడంతో శ్రీలంక భారత్‌పై మొదటి వికెట్ ను సాదించింది. ఇషాన్ కిషన్ (16) కూడా పవర్‌ప్లేలో పడిపోయాడు. ఏది ఏమైనప్పటికీ, శ్రేయాస్, శాంసన్ పరుగుల మెరుపులతో భారత్‌ను తిరిగి ఆటలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. సంజు అవుట్ అయిన తర్వాత రవీంద్ర జడేజా యొక్క భీకర నాక్ ఔట్ తో భారత్ ని విజయం వైపు నడిపించాడు.
ఈ విజయంతో, రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంపికైనప్పటి నుండి భారత్ వరుసగా మూడో వరుస విజయాన్ని సాధించింది. ధర్మశాలలో శ్రీలంకతో జరిగిన రెండో T20Iలో టీమిండియా తలపడి ఘన విజయం సాదించింది.. కాగా, రేపు హిమాచల్ ప్రదేష్ లో మూడో టీ20 జరగనుంది.. దీంతో రోహిత్ నేతృత్వంలోని భారత్ మరో క్లీన్ స్వీప్ విజయంపై కన్నేసింది.
స్కోరుబోర్డు..
శ్రీలంక ఇన్నింగ్స్
నిశాంక (ఎల్బీ) భువనేశ్వర్ 75, గుణతిలక (సి) వెంకటేశ్ అయ్యర్ (బి) రవీంద్రజడేజా 38, అసలెంక (ఎల్బీ) చాహల్ 2, కమిల్ మిశ్రా (సి) శ్రేయస్ అయ్యర్ (బి) హర్షల్ పటేల్ 1, దినేశ్ చండీమల్ (సి) రోహిత్ (బి) బుమ్రా 9, శనక (నాటౌట్) 47, కరుణరత్నే (నాటౌట్) 0. ఎక్స్‌ట్రాలు 11. మొత్తం: 183 (5వికెట్లు. 20ఓవర్లు). వికెట్లపతనం: 67-1, 71-2, 76-3, 102-4, 160-5. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-36-1, బుమ్రా 4-0-24-1, హర్షల్‌పటేల్ 4-0-52-1, చాహల్ 4-0-27-1, రవీంద్ర జడేజా 4-0-37-1.
భారత్ ఇన్నింగ్స్
రోహిత్‌శర్మ (బి) చమీర 1, ఇషాన్‌కిషన్ (సి) శనక (బి) లహిరు కుమార 16, శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 74, సంజూ శాంసన్ (సి) ఫెర్నాండో (బి) లహిరు కుమార 39, రవీంద్ర జడేజా (నాటౌట్) 45. ఎక్స్‌ట్రాలు 11. మొత్తం: 186 (3వికెట్లు. 17.1ఓవర్లు). వికెట్లపతనం: 9-1, 44-2, 128-3. బౌలింగ్: చమీర 3.1-0-39-1, ఫెర్నాండో 4-0-47-0, లహిరు కుమార 3-0-31-2, ప్రవీణ్ 2-0-19-0, కరుణరత్నే 3-0-24-0, శనక 2-0-24-0.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..