హీరో కార్తి నటిస్తున్న చిత్రం జపాన్. రాజు మురుగన్ దర్శకుడు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఈనెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ మీడియా సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు
- రాజు మురుగన్ చాలా వైవిధ్యమైన దర్శకుడు. తన ప్రతి సినిమా డిఫరెంట్ గా వుంటు-ంది. కార్తి గారు, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, డీవోపీ రవి వర్మన్, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ టీ-ం చాలా పెద్దది. జపాన్ కథ, పాత్ర చాలా యూనిక్. ఇలాంటి కథని గతంలో వినలేదు.
- కార్తి గారు అద్భుతమైన నటు-డు. తను టీ-ం ప్లేయర్. ఏదైనా సన్నివేశం చేసే ముందు చర్చించుకునే వాళ్ళం. ఆఫ్ స్క్రీన్ కార్తి గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయనతో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను.
- జపాన్ లో నా పాత్ర ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్‌గా వుంటు-ంది. ఇందులో నటిగా కనిపిస్తాను. నా పాత్ర జపాన్ జీవితంలో కీలకంగా వుంటు-ంది.
- నిర్మాత ఎస్ఆర్ ప్రభు గారు సినిమాపట్ల చాలా ప్యాషన్ వున్న నిర్మాత. కేరళ, కాశ్మీర్, చెన్నై.. ఇలా చాలా అద్భుతమైన లొకేషన్స్‌లో షూట్ చేశాం. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు.
- జపాన్ లో సునీల్ గారితో సీన్స్ వున్నాయి. సునీల్ గారు నా ఫేవరెట్ యాక్టర్. సునీల్ గారితో ఇంతకుముందు ఊర్వశివో రాక్షసివో సినిమా కోసం కలిసి పని చేశాను. తను చాలా వైవిధ్యమైన నటు-డు.
- నాకు డ్రీం రోల్స్ అంటూ ఏమీ లేవు. ప్రేక్షకులు ఇష్టపడే పాత్రలు చేయాలని వుంటు-ంది. అలాంటి మంచి పాత్రలు, కథలు రావాలని కోరుకుంటాను.