Friday, November 22, 2024

తెలంగాణలో ప్ర‌తిప‌క్ష పార్టీలు ప‌ర్య‌టించ‌కూడ‌దా? : భ‌ట్టి విక్ర‌మార్క‌

టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎల్పీనేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు వెళ్లకుండా ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ‌ ప్రతిపక్ష పార్టీలు పర్యటించకూడదా? అంటూ నిలదీశారు. భద్రాచలం నియోజకవర్గంలో ముంపు గురైన ప్రాంతాలను, నీటిపారుదల ప్రాజెక్టులను సందర్శించడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ముంపు ప్రాంతాల్ని సందర్శించలేదని, వారికి సహాయం అందించలేదని మండిపడ్డారు. ముంపు అంచనా కూడా వేయలేదన్నారు. క్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు నీట మునిగిపోయాయన్నారు. భద్రాచలం పినపాక నియోజకవర్గాల్లో అడుగడుగునా పోలీసులు అడ్డుకొని ఇల్లందు గెస్టహౌస్ లో వదిలి వెళ్లారని ఆయన ఆగ్రహించారు. మమ్మల్ని ఆటంక వాదుల్లాగా ఇబ్బందులకు గురి చేసి ఇక్కడ వదిలి వెళ్లారన్నారు. గెస్ట్ హౌస్ తాళాలు లేవని, రెండు గంటల పాటు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. బరాబర్ మొదలు పెట్టిన కార్యక్రమం పూర్తి చేస్తామని ఆయన అన్నారు. సందర్శనకు బయలుదేరిన మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను తాము బరాబర్ సందర్శిస్తామన్నారు. ప్రాజెక్టును సందర్శించడానికి బయలుదేరుతున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement