Friday, November 22, 2024

ఆర్ఎంపీ, పీఎంపీలకు సహకరించాలి.. ఆపరేషన్లు చేయ‌కుండా మందులిచ్చే వరకే పరిమితం: న‌న్న‌పునేని

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆర్ఎంపీ, పీఎంపీలకు తగు సహకారం అందించాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కోరారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. ఇప్పుడున్నంత ఆరోగ్య వ్యవస్థ లేని సమయంలో ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రజలకు వైద్య సేవలందించారని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రారంభించిన ఫార్మా శిక్షణను కొద్దిమంది వినియోగించుకున్నారన్నారు. వారికి సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారని, వారికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

అయితే.. ఈ ఆర్ఎంపీ, పీఎంపీలను కేవలం మందులిచ్చే వరకే పరిమితమవుతారని, వారు ఎలాంటి ఆపరేషన్లు చేయరని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని స్పీకర్ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును ఎమ్మెల్యే నరేందర్ కోరారు.

వీవోల మాదిరిగానే ఆర్పీలకు గౌరవ వేతనం పెంచాలి..

పంచాయతీరాజ్ శాఖలోని వీవోలకు గౌరవ వేతనం పెరిగిందని, అలాగే మున్సిపల్ శాఖ పరిధిలో ఉన్న రిసోర్స్ పర్సన్స్ (ఆర్పీ)లకు గౌరవ వేతనం పెరిగేలా చూడాలని స్పీకర్ ద్వారా ఆ శాఖ మంత్రి కేటీఆర్ ను ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేందర్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement