Thursday, November 21, 2024

చిప్‌ తయారీకి నిపుణుల కొరత.. 2027 నాటికి 10-13 వేల మంది అవసరం

మన దేశంలో ప్రస్తుతం చిప్‌ తయారీ ప్లాంట్లను నిర్వహించగలిగే నైపుణ్యం ఉన్న ఇంజినీర్ల కొరత ఉంఇ. ప్రస్తుతం విదేశాల నుంచే ఈ నిపుణులు వస్తున్నారు. 2027 నాటికి మన దేశంలో సెమికండక్టర్‌ పరిశ్రమలో చిప్‌ తయారీ ప్లాంట్లను నిర్వహించేందుకు 10 నుంచి 13 వేల మంది నిపుణులైన ఇంజినీర్లు అవసరం అవుతారని ఒక నివేదిక స్పష్టం చేసింది. మన దేశంలో సెమికండక్టర్‌ డిజైన్‌లో నిపుణులైన ఇంజినీర్లు చాలా మంది ఉన్నారని, సెమికండక్టర్‌ ప్లాంట్‌ను హ్యాండిల్‌ చేయగలిగిన నైపుణ్యం ఉన్న వారి కొరత అధికంగా ఉందని ఎలక్ట్రానిక్స్‌ సెక్టర్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఫౌండేషన్‌ డే సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఐటీ సైంటిస్ట్‌ ప్రశాంత్‌ కుమార్‌ చెప్పారు.

- Advertisement -

ప్రస్తుతానికి వీరు విదేశాల నుంచే వస్తున్నారని, క్రమంగా మన దేశంలోనే ఈ నిపుణులు అందుబాటులోకి వస్తారని ఆయన చెప్పారు. ఇలాంటి నిపుణులు దేశంలో ప్రస్తుతానికి తగినంతగా లేరని, 2027 నాటికి 10 నుంచి 13 వేల మంది సెమికండక్టర్‌ తయారీ యూనిట్లకు నిపుణులు అవసరం అవుతారని టాస్క్‌ఫోర్స్‌ నివేదిక స్పష్టం చేసిందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం చిప్‌ టూ స్టార్టప్‌ ప్రోగ్రామ్‌ను తీసుకుందని కుమార్‌ చెప్పారు. 2027 నాటికి 85 వేల మంది నిపుణులను తయారు చేసే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

ఇందు కోసం అత్యాధునిక చిప్‌ డిజైన్‌ ఈడీఏ టూల్స్‌ను అభివృద్ధి చేయనుంది. ఇందు కోసం 120 సంస్థలను ఎంపిక చేశారు. ఇందులో కాలేజీలు, స్టార్టప్‌ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. నిపుణులైన వారికి శిక్షణ ఇచ్చేందుకు విద్యార్ధులను ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఎలక్ట్రానిక్‌ సెక్టర్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ( ఈఎస్‌ఎస్‌సీఐ) ప్రభుత్వ సంస్థ సీఎస్‌సీ ఇ-గవర్నెస్‌ సర్వీసెస్‌తో కలిసి ఎలక్ట్రానిక్‌ ఒలంపియాడ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని స్కూల్స్‌, కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థల్లో ఎలక్ట్రానిక్స్‌ ప్రాజెక్ట్‌లపై విద్యార్ధులకు పోటీలు నిర్వహిస్తారు. వీటి ద్వారా అవసరమైన విద్యార్ధులను ఎంపిక చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement