హైదరాబాద్ నగర ప్రజలకు పోలీస్ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. బహిరంగంగా మద్యం తాగవద్దని, రోడ్లపై అల్లర్లు సృష్టించవద్దని హెచ్చరించింది. అలాగే, వాణిజ్య సంస్థల నిర్వాహకులకు పలు హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి రోజూ రాత్రి 10.30 నుంచి 11 గంటల మధ్య వ్యాపారాలను మూసివేయాలని హైదరాబాద్ పోలీసులు వాణిజ్య సంస్థల నిర్వాహకులను ఆదేశించారు.
రోడ్లపై అపరిచిత వ్యక్తు
లకు లిఫ్టులు ఇవ్వవద్దని, రాత్రిపూట నగరంలో రోడ్ల చుట్టూ తిరగవద్దని, హింసాత్మక ఘటనలు జరిగితే వెంటనే డయల్ 100కి కాల్ చేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన హింసాత్మక నేరాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ఆదేశాలు జారీ చేశారు.