Friday, November 22, 2024

Shootings Break – 63 ఏళ్ల త‌ర్వాత హ‌లీవుడ్ లో స‌మ్మె … యాక్ష‌న్ ,క‌ట్ కు బ్రేక్

లాజ్‌ఎంజెల్స్‌: హాలీవుడ్ లో 63 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా నటీనటులు, రచయితలు సమ్మె దిగ‌డంతో అమెరికా చిత్రపరిశ్రమలో అన్నికార్యకలాపాలు నిలిచి పోయాయి. కృత్రిమ మేధ నుంచి పొంచి ఉన్న ముప్పు, అరకొర జీతాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ. ఈ నిరవధిక సమ్మె కు యాక్ట‌ర్స్ గిల్డ్ స‌మ్మెకు పిలుపు ఇచ్చింది.. అంత‌కుముందు తమ ఆందోళనపై నిర్మాణ సంస్థలతో జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో స్క్రీన్‌ యాక్టర్స్ గిల్డ్ సమ్మె కు దిగింది. ఈ గిల్డ్‌కు 1,60,000 మంది నటీనటులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 11 వారాల క్రితం నుంచి సమ్మె చేస్తోన్న రచయితలకు వీరు తోడయ్యారు.

1960లో అంటే సరిగ్గా దాదాపు 63 ఏళ్ల క్రితం అప్పటి ప్రముఖ యాక్టర్, అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ నేతృత్వంలో ఈ రెండు సంఘాలు కలిసి సమ్మె చేశాయి. ఈ సమ్మెతో పలు సినిమాలు, టీవీ కార్యక్రమాలు, సిరీస్ షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. ఇక సినిమాలు, సిరీస్‌ల విడుదల కూడా ఆలస్యం కానుంది. స్క్రీన్‌ యాక్టర్స్ గిల్డ్‌లో ట్రామ్‌ క్రూజ్‌, ఏంజెలినా జోలీ, జానీ డెప్‌, మెరిల్‌ స్ట్రీప్‌, బెన్‌ స్టిల్లర్‌, కోలిన్‌ ఫారెల్‌ వంటి స్టార్స్‌ ఉన్నారు. వారిలో కొందరు ఈ సమ్మెకు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement