Saturday, November 23, 2024

షూటింగ్‌ వరల్డ్‌ కప్‌, అంజుమ్‌కు రజతం.. పతకాల పట్టికలో భారత్‌ అగ్రస్థానం

దక్షిణకొరియా చాంగ్వాన్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ షూటింగ్‌ స్పోర్ట్‌ ఫెడరేషన్‌ (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) వరల్డ్‌ కప్‌ రైఫిల్‌/పిస్టోల్‌/షాట్‌గన్‌ స్టేజ్‌లో మాజీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌, ఒలింపియన్‌ అంజుమ్‌ మౌడ్జిల్‌ రజత పతకం చేజిక్కించుకుంది. ఉమెన్స్‌ 50మీటరల్‌ రైఫిల్‌ 3 పొజిషన్స్‌ (3పీ) ఈవెంట్‌ పోటీలో అంజు అద్భుత ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచి బ్రోంజ్‌ మెడల్‌ కైవసం చేసుకుంది. శనివారంనాడు ఉమెన్స్‌ 3పీ ర్యాంకింగ్‌ రౌండ్‌ క్వాలిఫైడ్‌ మ్యాచ్‌లో ఆరో స్థానంలో నిలిచినా, ఆదివారంనాడు 8మంది షూటర్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో మూడో స్థానంలో నిలిచింది.

ఇక పురుషుల 3పీ బృందం గోల్డ్‌ మెడల్‌ మ్యాచ్‌లో చెక్‌ రిపబ్లిక్‌ టీమ్‌తో పోటీపడి 12-16తో రెండో స్థానంలో నిలిచి, సిల్వర్‌ మెడల్‌ సాధించింది. దీంతో ఈ టోర్నీలో పతకాల పట్టికలో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. భారత బృందం ఇప్పటికే 4 గోల్డ్‌, 5 సిల్వర్‌, 2 బ్రోంజ్‌ మెడల్స్‌ సాధించింది. ఆతిథ్య కొరియా 3 గోల్డ్‌, ఒక సిల్వర్‌ మెడల్‌తో పతకాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement