అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. వాషింగ్టన్ డీసీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్‌హౌస్’కు ఈశాన్య దిశలో 12 బ్లాకుల అవతలి ప్రాంతంలో కెన్నెడీ రిక్రియేషన్ సెంటర్ సమీపంలో ఈ ఘటన జరిగిందని మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
బాధితులు అందరూ పెద్ద వయసువారేనని మెట్రోపాలిటన్ పోలీస్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అధికారి జెఫ్రీ కారోల్ మీడియాకు తెలిపారు. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారని చెప్పారు. క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉందన్నారు. కాగా ఈ కాల్పులకు పాల్పడింది ఎవరనే విషయంపై స్పష్టత రాలేదు. నిందితుల అరెస్ట్‌పై పోలీసులు ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన సమాచారం ఏమైనా తెలిస్తే తమను సంప్రదించాలని కోరారు. దీంతో నిందితులను అన్వేషించే పనిలో అధికారులు ఉన్నారని స్పష్టమవుతోంది.
మరోవైపు పెన్సిల్వేనియాలోని ఫాల్స్ టౌన్‌షిప్‌లో ముగ్గురిని కాల్చి చంపిన నిందితుడు ఆండ్రీ గోర్డాన్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక పోలీసులు ప్రకటించారు. ఇటీవల పెన్సిల్వేనియాలోని రెండు వేర్వేరు ఇళ్లపై కాల్పులు జరిపి ముగ్గురిని హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం తమ అదుపులోనే ఉన్నాడని పేర్కొన్నారు.