అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. వివిద ప్రాంతాలలో జరిగిన కాల్పులలో మొత్తం 10 మంది మరణివంచారు.. లాస్ వెగాస్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.
మరొకరి పరిస్థితి విషమంగా ఉందని, స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు వెల్లడించారు. లాస్ వెగాస్ యూనివర్సిటీలో ఈ కాల్పులు జరిగాయని చెప్పారు. కాగా కాల్పులకు తెగబడ్డ అనుమానితుడు కూడా చనిపోయినట్టు ప్రకటించారు.
టెక్సాస్‌లోని రెండు నగరాల్లో కాల్పులు…
టెక్సాస్‌లోని ఆస్టిన్, శాన్ ఆంటోనియో నగరాల్లో కాల్పుల ఘటనల్లో ఇద్దరు పోలీసు అధికారులు సహా ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. శాన్ ఆంటోనియోలోని పోర్ట్ రాయల్ స్ట్రీట్ 6400 బ్లాక్ సమీపంలోని ఓ ఇంటి వద్ద 50 ఏళ్ల వయసున్న ఒక పురుషుడు, మహిళ మృతదేహాలను గుర్తించామని బెక్సర్ కౌంటీ పోలీసు అధికారి జేవియర్ సలాజర్ వెల్లడించారు. ఆస్టిన్‌లో వరుస కాల్పులకు ముందు అనుమానితుడు వీరిద్దరిపై కాల్పులు జరిపి ఉంటాడని అన్నారు.34 ఏళ్ల షేన్ జేమ్స్ అనే వ్యక్తి ఈ కాల్పులకు బాధ్యుడని ఆస్టిన్ పోలీసులు అనుమానిస్తున్నారు.