బెంగుళూరు – వెలుతురు ఉన్నప్పుడు మనకు నీడ కనిపించడం మాములే కదా. అయితే, ఓ ప్రాంతంలో మాత్రం నేడు అందరి నీడలు మాయం అయ్యాయి. అదెక్కడో కాదండోయ్.. నేటి మధ్యాహ్నం 12.17 గంటలకు బెంగుళూరు ఒక విశిష్టమైన ఖగోళ శాస్త్రానికి సాక్ష్యమైంది నగరంలో కొంతసేపటి వరకు వస్తువుల నీడ మాయమైంది. ఇలాజరగడాన్ని షాడో డే అని పిలుస్తున్నారు. బెంగళూరులోని కోరమంగళలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ సందర్భంగా తన క్యాంపస్‌లో షోడో డే ఈవెంట్ ను నిర్వహించింది.. ఈ అద్బుత విన్యాసంలో వందలాదిమంది పాల్గొని తమ నీడ మాయం కావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు..
జీరో షాడో డే అంటే ఏమిటి?
ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకారం, సూర్యుని కారణంగా మధ్యాహ్నం భూమిపై ఒకటిన్నర నిమిషాల పాటు ఏ వస్తువు నీడ కనిపించలేదు.. షాడో డే రోజైన నేడు నేటి మధ్యాహ్నం 12.17 నుంచి 12.18.30 వరకు భూమిపై ఏ వస్తువు నీడ కనిపించలేదని శాస్ర్తవేత్తల వెల్లడించారు…
ఇది ఎందుకు జరుగుతుంది?
భూభ్రమణ అక్షం సూర్యుని చుట్టూ తిరిగే సమతలానికి 23.5 డిగ్రీల వంపులో ఉంటుందని, దీని కారణంగా వివిధ రుతువులు ఏర్పడతాయాని ASI తెలిపింది. దీనర్థం సూర్యుడు, రోజులో అత్యంత ఎత్తైన ప్రదేశంలో, ఖగోళ భూమధ్యరేఖకు దక్షిణంగా 23.5 డిగ్రీల నుంచి భూమధ్యరేఖకు (ఉత్తరాయణ) ఉత్తరాన 23.5 డిగ్రీలకు, ఒక సంవత్సరంలో తిరిగి (దక్షిణాయన) కదులుతాడని వారు తెలిపారు. ఆ సమయంలో భారత్ లోని కొన్ని ప్రాంతాలలో కొన్ని సెకన్ల పాటు నీడ పడదని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు.