వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా వాసుపల్లి గణేశ్ వ్యవహరిస్తున్నారు. కాగా ఆ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు వాసుపల్లి. తన రాజీనామా లేఖను పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జీ అవంతి శ్రీనివాస్‌లకు పంపించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా కొనసాగుతున్న సీతంరాజు సుధాకర్ కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన వారే. సీతంరాజుతో విభేదాల కారణంగానే వాసుపల్లి పార్టీ పదవికి రాజీనామా చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. విశాఖ జిల్లాకు సంబంధించి పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ హోదాలో వైవీ సుబ్బారెడ్డి శనివారం తొలిసారి విశాఖకి వచ్చారు.
వైసీపీకి షాక్ -వైవీ సుబ్బారెడ్డికి రాజీనామా లేఖ పంపింన – నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి
Advertisement
తాజా వార్తలు
Advertisement