Friday, November 22, 2024

బిహార్ లో ఎంఐఎంకు షాక్.. పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలు..

బిహార్ రాష్ట్రంలో ఎంఐఎంకు భారీ షాక్ తగిలింది. నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు పార్టీ మారారు. నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు. తేజస్వి సమక్షంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆర్జేడీ పార్టీలో చేరారు. నవంబర్ 2020‌లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 20 స్థానాల్లో పోటీ చేసింది. పోటీ చేసిన 20 అసెంబ్లీ స్థానాల్లో ఐదు స్థానాలను గెలుచుకోవడం ద్వారా మంచి ప్రదర్శన ఇచ్చింది.

గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు అక్తరుల్ ఇమాన్ (అమూర్ నియోజకవర్గం), మహ్మద్ ఇజార్ అస్ఫీ (కొచ్చాడమామ్), షానవాజ్ ఆలం (జోకిహాట్), సయ్యద్ రుక్నుద్దీన్ (బైసీ), అజర్ నయీమి (బహదూర్‌గంజ్) ఆర్జేడీలో చేరిన వారిలో ఉన్నారు. ఆ పార్టీకి చెందిన అక్తరుల్ మినహా మిగిలిన నలుగురు 243 మంది సభ్యుల శాసనసభలో 80 మంది ఎమ్మెల్యేలతో శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ఆర్జేడీలో చేరిపోయారు. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కూడా ఒవైసీ పార్టీలోని నలుగురు ఎమ్మెల్యేల చేరికను ధృవీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement