రిలయన్స్ జియో వాడుతున్న కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఉన్నట్టుండి సిగ్నల్ రాకపోవడం, ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ చేసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇట్లాంటి నెట్వర్స్ ఇష్యూస్‌తో ముంబై వాసులు ఇవ్వాల (శనివారం) బాగా సతమతమయ్యారు. దీనిపై పెద్ద ఎత్తున జియో ఆఫీసులకు కంప్లెయింట్స్ వచ్చాయి. అంతేకాకుండా జియో నెట్‌వర్క్‌పై కొంతమంది అయితే తమ అక్కసు వెళ్లబోసుకుంటూ.. ఫన్నీగా ట్రోల్స్ చేశారు.
రిలయన్స్ జియో వినియోగదారులు ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫిర్యాదుల ప్రకారం.. ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. జియో కస్టమర్స్ కాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా “Not registered on network” అని మెసేజ్ వస్తున్నట్టు చాలా మంది నుంచి కంప్లెయింట్స్ వచ్చాయి.
నెట్వర్క్ సమస్యపై ట్విట్టర్లో ఫిర్యాదు చేస్తున్న వినియోగదారుకు రిలయన్స్ కస్టమర్ సపోర్ట్ హ్యాండిల్ (జియో కేర్) స్పందిస్తూ.. ‘‘హాయ్! మీరు ఇంటర్నెట్ సేవలను ఉపయోగించడం లేదా.. మీ మొబైల్ కనెక్షన్లో కాల్స్ స్వీకరించడం, కాల్స్ చేయడం వంటి సమస్యను ఎదుర్కోవచ్చు. ఇది తాత్కాలికంగా జరిగే సమస్య. మా టీమ్ దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తోంది’’.. అంటూ కస్టమర్లకు రిప్లై ఇచ్చింది జియో కేర్.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..,