ఐపీఎల్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్‌కు సీజన్ ఆరంభానికి ముందే షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్‌జాసన్ రాయ్.. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ ఆడలేనని ప్రకటించాడు. దీంతో గుజరాత్‌కు మరో ప్లేయర్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. 10 జట్లతో స్టార్ ఆటగాళ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడగా.. తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లను దక్కించుకున్నామనే సంతృప్తి గుజరాత్‌కు లేకుండా పోయింది. రూ.2కోట్ల కనీస ధరకు జాసన్ రాయ్‌ను తీసుకున్న గుజరాత్.
ఇప్పుడు అదే బడ్జెట్‌లో మరో ఆటగాడిని తీసుకోవాలని భావిస్తున్నది. 2022 వేలంలో అమ్ముడుపోని సురేష్ రైనాను తీసుకునే ఆలోచనలో గుజరాత్ టైటాన్స్ ఉన్నట్టు సమాచారం. సీనియర్ ప్లేయర్ కావడంతో జట్టుకు కొంత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్‌లో రైనా, ఎంతో కీలక ఆటగాడు. గత సీజన్‌లో రైనా విఫలం కావడంతో.. ఈసారి ఎవరూ కొనుగోలు చేయలేదు. ఇప్పటి వరకు 205 మ్యాచులు ఆడిన రైనా.. 135 స్ట్రయిక్‌రేట్‌తో 5528 పరుగులు చేశాడు. ఓ సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..